వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

173
pm modi

ఇవాళ లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సభలో మొత్తం 451 ఓట్లు పోలయ్యాయి. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు రాగా, అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాసానికి అనుకూలంగా మెజార్టీ లేకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. సభలో అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేశారు.

Parliament