బీహార్‌లో మహా కూటమి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఎక్కవ కాలం పాటు కొనసాగలేదంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం బాగానే నడుస్తుందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో బీజేపీ ఆందోళన చెందుతోందున్నారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ గెలిచారనీ కానీ 2024లో ఆ పార్టీకి ఉండే అవకాశాలపై ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 2024లో ఆయన గెలుస్తారా అన్నదే తన ప్రశ్న అన్నారు. ప్రధాని పదవికి తాను పోటీదారుగా లేనన్నారు. బీజేపీని వీడాలని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని నితీష్ పునరుద్ఘాటించారు.
2024లో మోదీ గెలుస్తారా..!? నితీష్
- Advertisement -
- Advertisement -