మినీ ఇండియాగా ప్రసిద్ధి చెందిన మారిషస్‌లో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా మోదీకి స్వాగతం పలికారు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులం. ఇక మారిషస్‌తో మోడీకి 27 ఏళ్ల అనుబంధం ఉంది.
27 సంవత్సరాల క్రితం మోదీ మౌరిషస్కు వెళ్లి రామాయణ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. 1998 అక్టోబర్‌లో మొదటిసారి మారిషస్ వెళ్లినప్పుడు ఆయన భాజపా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మారిషస్ జనాభా గోవా కంటే తక్కువే అయినా, అక్కడ మోదీ పర్యటనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మధుర స్మృతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రామాయణ కాన్ఫరెన్స్‌లో మోదీ రాముని విలువల గురించి ప్రసంగిస్తూ, రామాయణం భారత్-మౌరిషస్ మధ్య ఉన్న పురాతన నాగరికత సంబంధాల వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మారిషస్‌లోని రామాయణ సెంటర్ ఈ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. మౌరిషస్లో హిందువులు మొత్తం జనాభాలో 48% ఉన్నారు.
Also Read:శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి!

