మోదీ విషసర్పమా.. గరళకంఠుడా ?

44
- Advertisement -

కర్నాటక ఎన్నికల వేళ ఆ రాష్ట్ర రాజకీయలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శ ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. కర్నాటక ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మద్యనే అనే విషయం తెలిసిందే. దాంతో ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్న రసవత్తరమైన పోరు అందరి దృష్టి కర్నాటకపై పడేలా చేస్తోంది. నిన్నమొన్నటి నామినేషన్ల పర్వంలో తలమునకలైన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ప్రచారాలు, సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి వాళ్ళు ప్రచారాలలో పాల్గొంటుంటే.. మరోవైపు బీజేపీ తరుపున అమిత్ షా, ప్రధాని మోడి రంగంలోకి దిగుతున్నారు. .

ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు చేసుకుంటున్న విమర్శలు ప్రతి విమర్శలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ప్రధాని మోడిపై విమర్శలు గుప్పిస్తూ మోడీ ఒక విషసర్పం అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కమలనాథులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మోడీని విషసర్పం అన్న వారికి ఓటమి భయంతో మతిభ్రమించిందని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు.

Also Read: KTR:పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

మోడీని ఎంత విమర్శిస్తే ప్రజల్లో ఆయనకు అంత మద్దతు పెరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదని.. ఆ పార్టీ నిండా అవినీతి, కులతత్వం, వంశపాలన వంటి వాటితో కూరుకుపోయిందని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు అమిత్ షా. ఇక కాంగ్రెస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తనదైన రీతిలో మండి పడ్డారు. మోడీ విషసర్పం కాదని కాంగ్రెస్ చిమ్ముతున్నా విషాన్ని భరిస్తున్న గరళకంఠుడు అంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. మొత్తానికి కర్నాటక ఎన్నికల ప్రచారాలలో కొనసాగుతున్న విమర్శల పర్వం.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: ” కలిసుంటే కలదు సుఖం “.. కాంగ్రెస్ కొత్త ఫార్ములా !

- Advertisement -