- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని కరావల్ నగర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్న తర్వాత, బీజేపీకి చెందిన వివిధ నియోజకవర్గాల అభ్యర్థులను ఆయనతో కలవడానికి ఆహ్వానించారు.
పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగీ ప్రధాని వద్దకు వెళ్లారు. రవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో మోదీ రవీంద్ర నేగీని తన కాళ్లు తాకకుండా ఆపే ప్రయత్నం చేయడం ఆ తర్వాత తానే ఆయన కాళ్లు తాకడం స్పష్టంగా కనిపించింది.
Also Read:31 నుండి పార్లమెంట్ సమావేశాలు
- Advertisement -