ఆసియాలో అతి పెద్ద సొరంగ మార్గాన్ని జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. జమ్మూ- శ్రీనగర్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు నిర్మించిన ఈ టన్నెల్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఏటా వంద కోట్లకు పైగా ఇంధన భారాన్ని తగ్గించడమే కాకుండా, జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని రెండు గంటలు తగ్గించేందుకు ఈ సొరంగం ఉపయోగపడుతుంది. టన్నెల్ ను ప్రారంభించిన అనంతరం….ప్రధాని మోడీ..సొరంగమార్గంలో ప్రయాణం చేశారు. మధ్యలో దిగి..టన్నెల్ నిర్మాణాన్ని పరిశీలించారు.
జమ్మూకాశ్మీర్ ఉదంపూర్ జిల్లాలోని ఛెనాని-నష్రీ మధ్య 9.2 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ ను నిర్మించారు. సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ…టన్నెల్ లో ప్రయాణించారు. ఆయన వెంట గవర్నర్ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రులు ఉన్నారు. టన్నెల్ చివరి వరకు ఓపెన్ టాప్ జీపులో ప్రధాని ప్రయాణం చేశారు. టన్నెల్ మధ్యలో ఆగి…నిర్మాణ పనులను, లోపల సౌకర్యాలను పరిశీలించారు. అత్యవసర ద్వారాలను, వాటి పనితీరును స్వయంగా చెక్ చేశారు ప్రధాని. ఇక టన్నెల్ లో కొద్ది దూరం నడిచారు..
ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా జమ్మూ-శ్రీనగర్ మధ్య రెండు గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రయాణ దూరం 41 కి.మీ. నుంచి 10.9 కిలోమీటర్లకు తగ్గనుంది. సొరంగ మార్గం వల్ల ఏడాదికి 99 కోట్ల ఇంధనం, రోజుకు 27 లక్షల ఇంధనం పొదుపు చేసే అవకాశం ఉంది. టన్నెల్ నిర్మాణానికి 25వేల కోట్లు ఖర్చు పెట్టారు.2011లో ప్రారంభమైన టన్నెల్ నిర్మాణ పనులు…ఎన్డీయే సర్కారు వచ్చిన తర్వాత మరింత వేగవంతమయ్యాయిదేశంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా రికార్డుకెక్కిన ఈ టన్నెల్ లో అన్ని అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు.