చాయ్‌ వాలా..కాఫీ తాగిన వేళ

213
Modi takes coffee break on Mall Road
- Advertisement -

ఒకప్పటి చాయ్‌ వాలా ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నాడు. రోడ్డుపై ఉన్న ఓ కాఫీ హౌజ్‌లో చాయ్‌ రుచి చూశారు ప్రధాని మోడీ. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోడీ…హెలిప్యాడ్ వద్దకు ప్రధాని మోడీ రోడ్డుమార్గంలో బయల్దేరారు.

మార్గం మధ్యలో ఇండియన్ కాఫీ హౌజ్ వద్ద కాసేపు ఆగి ఓ కప్పు చాయ్ తాగారు. చాయ్ రుచి చూసిన ప్రధాని మోడీ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ తరువాత అక్కడి వారితో సరదాగా ఫోటోలు దిగారు.

modi
గతంలో పార్టీ పనుల మీద సిమ్లాకు వచ్చినప్పుడల్లా మోడీ ఇండియన్‌ కాఫీ హౌజ్‌లో చాయ్‌ తాగుతూ కాసేపు అక్కడ గడిపేవారు.  ఇవాళ ప్రధాని హోదాలో సిమ్లాకు రావడం..స్ధానికులతో కలిసి ముచ్చటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

modi

- Advertisement -