26న మోడీ ప్రమాణస్వీకారం..!

293
modi
- Advertisement -

రెండోసారి వారణాసి నుంచి విజయబావుట ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తన సమీప ఎస్పీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై 4లక్షలకు పైగా మెజార్టీతో మోదీ గెలుపొందారు. పోలైన ఓట్ల‌లో.. మోదీ ఖాతాలోనే 63 శాతం ఓట్లు ప‌డ్డాయి. మోదీపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్‌కు కేవ‌లం 53 వేల ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి.

2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తొలిసారిగా వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. కాగా.. ఈ నెల 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ విజయంపై ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ కలిస్తే విజయీ భారత్‌ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -