పార్లమెంట్ రద్దు..8న పీఎంగా మోడీ ప్రమాణం

16
- Advertisement -

ఈ నెల 8న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. దీంతో కేంద్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు మోడీ రెడీ అయ్యారు. ఇక కాసేపటి క్రితం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 17 పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా ఈ కాపీని రాష్ట్రపతికి అందించారు మోడీ.

ఇవాళ సాయంత్రం ఎన్డీఏ కూటమి సమావేశం అనంతరం నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూటమి నేతలు కలవనున్నారు. మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ అరుదైన రికార్డును నెలకొల్పనున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన రెండో నేతగా రికార్డు సృష్టించనున్నారు.

Also Read:గెలిచిన..ఓడిన సినీ ప్రముఖులు వీరే!

- Advertisement -