Modi: మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌

21
- Advertisement -

త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవబోతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వికసిత్‌ భారత్‌ దిశగా ప్రస్ధానం అనే అంశంపై సీఐఐ నిర్వహించిన సదస్సులో ప్రారంబోపన్యాసం చేశారు మోడీ. ఇవాళ మనం వికసిత్‌ భారత్ దిశగా పయనిస్తున్నామని, ఈ మార్పు కేవలం సెంటిమెంట్లతో రాలేదని, ఆత్మవిశ్వాసంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. భారత్‌ త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ అభివృద్ధికి మూలధన వ్యయం కీలకమని 2004లో యూపీఏ తొలి బడ్జెట్‌లో మూలధన వ్యయం కేవలం రూ. 90,000 కోట్లు కాగా, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు పైగా మూలధన వ్యయం వెచ్చిస్తోందని ఈ నిధులతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

గత పదేండ్లుగా తాము దేశ ఆర్థిక పరిస్ధితిని మార్చివేశామని …గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే తాము రైల్వే బడ్జెట్‌ను 8 రెట్లు పెంచామని, హైవేల బడ్జెట్‌ను 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్‌ను 4 రెట్లు పెంచామని తెలిపారు. రక్షణ బడ్జెట్‌ను రెండింతలు పైగా పెంచామని …శ్వేతపత్రం రూపంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ ముఖచిత్రాన్ని దేశ ప్రజల ముందుంచామని చెప్పారు.

Also Read:Paris Olympics 2024 : చరిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్‌..

- Advertisement -