AI విప్లవాన్ని ముందుండి నడిపిస్తాం:మోదీ

5
- Advertisement -

ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్‌లో ప్రధాని Narendra Modi కృత్రిమ మేధస్సు (AI) కోసం భారతదేశం రూపొందించిన “MANAV” దృష్టిని ప్రపంచానికి పరిచయం చేశారు. నాలుగో రోజు జరిగిన ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron కీలక ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు.

ఫిబ్రవరి 16న ఢిల్లీలో ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద AI సదస్సుకు 500కి పైగా గ్లోబల్ AI నాయకులు హాజరయ్యారు. ప్రధాని మాట్లాడుతూ, AI విధానాల్లో “సర్వజన హితం – సర్వజన సుఖం” అనే భావన ప్రతిబింబిస్తుందని చెప్పారు. సాంకేతికత మనుషులను డేటా పాయింట్లుగా కాకుండా, వారి సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు AI అందుబాటులో ఉండాలని, సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.

MANAV భావనలో M – నైతిక వ్యవస్థ, A – బాధ్యతాయుత పాలన, N – జాతీయ సార్వభౌమత్వం (తమ డేటాపై యాజమాన్యం), A – అందుబాటు & సమగ్రత, V – చట్టబద్ధత అని వివరించారు. భారత్ AI విప్లవంలో భాగస్వామి మాత్రమే కాకుండా, దానిని ముందుండి నడిపిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.

Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -