మతాన్ని తలాక్‌తో ముడిపెట్టవద్దు…

209
- Advertisement -

ట‌్రిపుల్ త‌లాఖ్‌ను రాజ‌కీయం చేయటం తగదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోరారు. యూపీలోని మహోబాలో జరిగిన బుందేల్ ఖండ్‌ పరివర్తన్‌ ర్యాలీలో ప్రసంగించిన మోడీ.. మ‌హిళ‌ల‌కూ స‌మాన హ‌క్కుల‌ను ఇవ్వ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుందామ‌ని పిలుపునిచ్చారు.ఇది అభివృద్ధికి సంబంధించిన అంశ‌మ‌ని ఆయ‌న అన్నారు. కొంతమంది కేవ‌లం ఓట్ల కోసం ముస్లిం మ‌హిళ‌ల‌కు ఉండాల్సిన హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని మోడీ విమ‌ర్శించారు. ఓ వ్య‌క్తి ఫోన్లో మూడుసార్లు త‌లాఖ్ అని అంటే ఓ ముస్లిం మ‌హిళ జీవితం నాశ‌నమైపోవాల్సిందేనా.. ఇది స‌బ‌బేనా అని ప్ర‌శ్నించారు.

2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న వాతావ‌ర‌ణ‌మే ఇప్పుడూ ఉంద‌ని, యూపీలో బీజేపీ గెల‌వ‌డం ఖాయ‌మ‌ని మోడీ స్ప‌ష్టంచేశారు. ఎస్పీ, బీఎస్పీ ఎవ‌రి శైలిలో వారు దోచుకుంటార‌ని విమ‌ర్శించారు. ఎస్పీ, బీఎస్పీల‌కు త‌గిన బుద్ధి చెప్పాల‌ని, యూపీని ఉత్త‌మ ప్ర‌దేశ్‌గా మార్చాల‌నుకుంటున్న బీజేపీకి ప‌ట్టం క‌ట్టాల‌ని మోడీ కోరారు.యూపీ ఎంద‌రో ప్ర‌ధాన‌మంత్రుల‌ను దేశానికి ఇచ్చింద‌ని, తన‌ను కూడా అందులో ఒక‌డిగానే భావిస్తున్నార‌ని మోడీ అన్నారు. యూపీ తల్లిలాంటిద‌ని, ఇక ఏమాత్రం త‌మ త‌ల్లిని దోచుకునే అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని పిలుపునిచ్చారు.

Muslims

ముస్లిం పురుషులు ఎవరైనా మూడు సార్లు తలాక్ అని భార్యకు చెబుతే ఆ జంట విడిపోయినట్టే అని చెబుతోంది. ఈ మతాచారాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ ను తీసుకొచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా ఓపెన్ డిబేట్లను ఆహ్వానించింది మోడీ సర్కార్. ముస్లిం లా బోర్డ్ దీన్ని వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ ప్రభుత్వం తలాక్ విధానాన్ని రద్దు చేయాలంటోంది. ముస్లిం ప్రజల అభిప్రాయాన్నితెలుసుకునేందుకు వివిధ జాతీయ వార్తా చానళ్లు చర్చను లేవనెత్తగా అది కాస్తా ముస్లిం, హిందూ సమస్యగా మారిపోయింది. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ తలాక్ మతాచారాన్ని హిందూ, ముస్లిం సమస్యగా చిత్రీకరించకండని కోరారు.

- Advertisement -