దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన కేదార్‌నాథ్ సాహ్ని స్మృతిగ్రంథ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ….కేందాన్ సాహ్నికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ… నల్లధనానికి మద్దతుగా కొందరు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. వ్యవస్థలో భాగమైన అవినీతి, నల్లధనాన్ని మనం ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు. రాజీ లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలని మోడీ పిలుపునిచ్చారు. కేదార్‌నాథ్ సాహ్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. కొందరు నల్లధనానికి మద్దతుగా మాట్లాడటం దురదృష్ణకరమని పేర్కొన్నారు.
మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయం.. సామాన్యుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు.. వికలాంగులు… వితంతువులు వారి పింఛన్లు కోసం పాట్లు పడుతున్నారు. బ్యాంకులు.. ఏటీఎంల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. పాతనోట్లు రద్దుకావడంతో పింఛన్లపై ఆధారపడే వికలాంగులు..వృద్ధులు.. వితంతువులు అవస్థలు పడుతున్నారు.
ఇక పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు మెచ్చుకున్నారు. దేశ ప్రయోజనాల కోసం మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని దీనిని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని మోడీ తెలిపారు. ఇన్నేళ్లు ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయం తమ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ఇవి కొన్ని రోజులు మాత్రమేనని తెలిపారు.