- Advertisement -
విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్కాట్లాండ్లో డ్రమ్స్ వాయించారు. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 (COP26) మీట్లో మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం మోదీ ఇండియాకు బయల్దేరే ముందు భారతీయులు ఘనంగా వీడ్కోలు పలికారు.
అక్కడ స్థిరపడిన భారతీయులతో మోదీ ముచ్చటించారు. చిన్న పిల్లలను ఆప్యాయంగా పలుకరించి, ఆశీర్వదించారు. గ్లాస్గోలో మంగళవారం జరిగిన కాప్-26 (COP26) మీట్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయం తెలిసిందే.
- Advertisement -