బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 59 హైలైట్స్

110
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 59 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 9వ వారంలో కెప్టెన్ తప్ప పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు.తాజా ఎపిసోడ్‌లో నామినేట్ అయిన పది మంది సభ్యుల్లో ఒక్కరు తప్పించుకునే అవకాశం కల్పించారు బిగ్ బాస్. ఇందుకోసం ఓ టాస్క్ ఇచ్చారు.

గార్డెన్ ఏరియాలో ఆడాల్సిన ఈ టాస్క్‌ను మొత్తం మూడు భాగాలుగా విభిజించాడు. బ్యాగేజ్ జోన్,సేఫ్ జోన్,డేంజర్ జోన్ అంటూ మూడు భాగాలుంటాయి. బ్యాగేజ్ జోన్‌లో కంటెస్టెంట్ల ఫోటోలతో బ్యాగులుంటాయి. వాటిని తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్‌లోకి రావాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారు డేంజర్ జోన్‌లోకి వస్తారు. చివరన వచ్చిన కంటెస్టెంట్‌తో పాటుగా వారి చేతిలో ఎవరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు కూడా డేంజర్ జోన్‌లో ఉంటారు. అలా ప్రతీ రౌండ్లో ఎవరో ఒకరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు. ఒకరు సేఫ్ అవుతుంటారు. అలా చివరకు ఒక్కరు మాత్రమే ఆటలో మిగులుతారు. వారికే ఇమ్యూనిటీ లభిస్తుందని తెలిపారు.

తొలుత రామచంద్ర… కాజల్‌ను ఆటలోంచి తప్పించేందుకు స్కెచ్ వేసి మరి డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఇంటి సభ్యుల మెజార్టీ అభిప్రాయంతో శ్రీరామ్‌కు రెండో రౌండ్‌కు వెళ్లాడు. కాజల్ అవుట్ అయింది. రెండో రౌండ్‌లో జెస్సీ సేఫ్ జోన్‌లోకి రాగా సన్నీ పక్కకి తప్పుకున్నాడు. ఇక మూడో రౌండ్లో సిరి సేఫ్ అయి నాల్గో రౌండ్లోకి వెళ్లగా విశ్వ అవుట్ అయ్యారు. ఇక ఐదో రౌండ్లో శ్రీరామచంద్ర సిరి అవుట్ అయింది. రవికి ఎక్కువ ఓట్లు రావడంతో ఆరో రౌండ్లోకి వచ్చేశాడు.

ఆరో రౌండ్లో ప్రియాంక బ్యాగుని పట్టుకోకుండా పరిగెత్తుకుంటూ రావడంతో నేరుగా అనర్హులిగా ప్రకటించాడు. ఏడో రౌండ్లో మానస్ చివరన రావడం, అతని చేతిలో రవి బొమ్మ ఉన్న బ్యాగు ఉండటంతో ఆ ఇద్దరూ నామినేట్ అయ్యారు. రవి పక్కకు తప్పుకోవడంతో మానస్ ఎనిమిదో రౌండ్లోకి వెళ్లాడు. ఇక చివరగా ఎనిమిదో రౌండ్లో మానస్ చివరన రావడం, ఆనీ మాస్టర్ బొమ్మ ఉన్న బ్యాగు పట్టుకోవడంతో ఇద్దరూ డేంజర్ జోన్‌లోకి వచ్చారు.

అలా చివరకు శ్రీరామచంద్ర, ఆనీ మాస్టర్ ఉండటంతో.. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లతో ఆనీ మాస్టర్‌కు ఇమ్యూనిటీ లభించింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. గత వారం ఆనీ మాస్టర్‌కు వచ్చిన పవర్‌ను వాడే సమయం వచ్చిందని చెప్పాడు. ఆ పవర్‌తో ఒక ఇంటి సభ్యుడిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు. దీంతో ఆనీ మాస్టర్.. తన పవర్‌ను మానస్‌కు ఇచ్చింది. దీంతో ఈ వారం సిరి, జెస్సీ, కాజల్, సన్నీ, విశ్వ, రవి, శ్రీరామచంద్ర, ప్రియాంకలు 9వ వారానికి నామినేట్ అయ్యారు.

- Advertisement -