వందే మాతరం అనే మాట మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది….సాధించలేని లక్ష్యం ఏదీ లేదని ధైర్యం ఇస్తుంది అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సంవత్సరం “వందే మాతరం” రచనకు 150 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1875 నవంబర్ 7న, అక్షయ నవమి సందర్భంగా బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ్ ఈ జాతీయ గీతాన్ని రచించారు.
శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో “వందే మాతరం” రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంవత్సరం పొడవునా జరిగే వేడుకలను ప్రారంభం ఇచ్చారు. ఈ సందర్భంగా బంకించంద్ర జ్ఞాపకార్థంగా తపాలా స్టాంప్ మరియు నాణెం విడుదల చేశారు.
ఆయన ప్రసంగిస్తూ అన్నారు:
వందే మాతరం అనే మాట మన ఈ క్షణాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుంది. ఇది మనకు ధైర్యం ఇస్తుంది… సాధించలేని లక్ష్యం అనేది లేనిదని మనకు గుర్తుచేస్తుంది అన్నారు. వందే మాతరం మనకు కొత్త ప్రేరణను ఇస్తుంది, దేశ ప్రజలందరిలో కొత్త శక్తిని నింపుతుంది అన్నారు. ఈ మహత్తర గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచి, ఈ రోజుకీ దేశభక్తి, ఐక్యత, గర్వభావాలకు ప్రతీకగా నిలుస్తోంది.
Also Read:Trump:త్వరలో భారత్‌కు వస్తా
“వందే మాతరం” మొదటగా బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ్ రచించిన ‘ఆనందమఠ’ నవలలో భాగంగా ‘బంగదర్శన్’ పత్రికలో ప్రచురించబడింది. ఈ గీతం భారత మాతను శక్తి, సంపద, దైవత్వం యొక్క ప్రతిరూపంగా ఆరాధిస్తూ, దేశం యొక్క ఐక్యత, ఆత్మగౌరవం పట్ల ఒక కావ్యరూపమైన భావోద్వేగాన్ని వ్యక్తపరచింది. తరువాత ఈ గీతం దేశభక్తికి ప్రతీకగా మారి, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక శాశ్వత చిహ్నంగా నిలిచింది.

