జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఉన్నారు. దాడి తీరును ప్రధాని మోదీకి వివరించగా ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశం కానుంది.
ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో పలు రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపుచర్యలు చేపట్టాయి.
Also Read:జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి..

