నిజమైన విజేతలు ఢిల్లీ ప్రజలే, అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీని అభివృద్ధి చేస్తామని, ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు.
బీజేపీ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారెంటీ అని అన్నారు.
బీహార్ లో నితీశ్ కుమార్ సైతం ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారు అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వనివ్వకుండా చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఢిల్లీ వాసులకు అందనివ్వలేదు. ఢిల్లీకి అసలు ఓనర్ ఢిల్లీ ప్రజలే నని ఓటర్లు స్పష్టం చేశారు. ఢిల్లీకి ఓనర్ అవుదామనుకునే అహంభావులను తిప్పికొట్టారు అన్నారు.
Also Read:భారీ అంచనాలతో..’1000 వాలా’

