Modi 3.0:మోడీ ప్రమాణస్వీకారం

7
- Advertisement -

దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.17 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు మోడీ.

అంతకుముందు వార్‌ మెమోరియల్‌ వద్ద అమరులకు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి పుష్పాంజలి ఘటించారు. మోడీ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సీడీఎస్‌ జనరల్‌ అనీల్‌ చౌహాన్‌, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి ఉన్నారు.

ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8 వేల మంది అతిథులు మోడీ ప్రమాణాన్ని తిలకించనున్నారు.

Also Read:ది బ‌ర్త్‌డే బాయ్.. టైటిల్ గ్లింప్స్

- Advertisement -