ఫిబ్రవరి 1న ఓట్ ఆన్‌ అకౌంట్ బడ్జెట్..

240
ARUN JAILEY
- Advertisement -

కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం. జనవరి 31 నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.

ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్.

ఈ సమావేశాల్లోనే అగ్రవర్ణాలకు చెందిన పేదలకు రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును అమోదించిన కేంద్రం మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమైంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ కట్టే ప్రజలకు తీపి కబురు అందించనున్నట్లు సమాచారం. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాకర్షక బడ్జెట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

- Advertisement -