ఇండియన్‌ 2..కొరియన్ భామతో కమల్‌ రొమాన్స్‌

176
kamal

క్రియేటివ్ దర్శకుడు శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు.2 దశాబ్ధాల క్రితం విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనుండగా మరోసారి వీరి కాంబినేషన్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

భారీ హంగులతో రూపొందనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తుండగా సౌత్ కొరియన్ హీరోయిన్ భే సూజి కూడ ఒక ముఖ్య పాత్రలో నటించనుందట. తైవాన్ దేశంలో రూపొందించనున్న కొన్ని సన్నివేశాల కోసం సూజిని తీసుకున్నారట శంకర్.

ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్రయూనిట్‌ ప్రకటించనున్నారు. అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అవినీతి అరికట్టడంపై వివిధ భాషల్లో ఎన్నోసినిమాలు వచ్చాయి కానీ అవేవీ భారతీయుడు సినిమాలా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో శంకర్-కమల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.