వైరల్ :  ‘మోడీ – మెగాస్టార్’ మధ్య ట్వీట్ల చర్చ !  

143
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ వరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డు  అందుకుంటున్న క్రమంలో  పలువురు సినీ, రాజకీయ  ప్రముఖులు తమ అభినందనలు తెలుపుతూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మెగాస్టార్ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో  విశిష్టమైన ఇండియన్  ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా  చిరంజీవికు నా అభినందనలు.  చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనా చాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు’ అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేయడం ఆకట్టుకుంది.

ఇక ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ కి మెగాస్టార్ రీట్వీట్ చేస్తూ.. ‘గౌరవనీయమైన ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ జీ   మీ మంచి మాటలకు చాలా కృతజ్ఞతలు” అంటూ చిరు వినమ్రంగా ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం  మోడీ – చిరు ల మధ్య జరిగిన ఈ ట్వీట్ల చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ పురస్కారం పై స్పందించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం అంటూ పవన్ కళ్యాణ్  చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్ తో కుర్ర హీరో పోటీ !

రేటును అమాంతం తగ్గించేసింది.. మరీ పిలుస్తారా ?

నేను ఫెయిల్..తమ్ముడు పాస్‌!

- Advertisement -