డొనాల్డ్ ట్రంప్‌తో ప్ర‌ధాని మోడీ భేటీ..

16
- Advertisement -

అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భేటీ అనంత‌రం ఇరువురు దేశాధినేత‌లు మీడియాతో మాట్లాడుతూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంది. 140 కోట్ల మంది భార‌తీయుల త‌ర‌ఫున ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు మోదీ. మ‌రో నాలుగేళ్లు ట్రంప్ తో క‌లిసి ప‌ని చేయ‌నుండటం సంతోషంగా ఉందన్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్తాం అని అన్నారు.

డొనాల్డ్‌ ట్రంప్ మాట్లాడుతూ… భార‌త్‌ కు న‌రేంద్ర‌ మోదీ లాంటి నేత ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణం. మోదీ నాకు చాలా ఏళ్లుగా మిత్రుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొన‌సాగిస్తాం. దేశాలుగా భార‌త్‌, యూఎస్ క‌లిసి ఉండ‌టం చాలా ముఖ్యం అన్నారు.

అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న‌తో మోదీ స‌మావేశ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. మోదీ వెంట భార‌త విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు.

Also Read:వేసవిలో ముంజలు.. ఎంతో మేలు!

- Advertisement -