మోడీ “మన్ కీ బాత్ “.. మౌనమేందుకు జీ !

41
- Advertisement -

నరేంద్ర మోడీ ప్రస్తుతం చాలా విషయాలపై మౌనం వహిస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి ఆయన మాత్రం మౌనం వీడడం లేదు. ఇటీవల గౌతమ్ ఆదానీ హిండెన్ బర్గ్ నివేధికల అంశం ఎంతటి సంచలనం అయిందో మనందరికి తెలిసిందే. ఆదానీ గ్రూప్ కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నాయని ఆ నివేధిక ఆధారాలతో సహ బయట పెట్టినప్పటికి మోడీ సర్కార్ మాత్రం ఆదానీ విషయంలో ఇంతవరకు స్పందించలేదు. ఆదానీ సంస్థలు నిర్వీర్యం కాకుండా మోడీ కొమ్ము కాస్తున్నారని, మోడీ అవినీతిని పెంచి పోషిస్తున్నారని ఇలా రకరకాల విమర్శలు వస్తున్నప్పటికి వాటికి సమాధానం ఇచ్చిఎందుకు బిజెపి ముందుకు రావడం లేదు.

Also Read: KTR:దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి…

పార్లమెంట్ లో ఆదానీ వ్యవహారాపై చర్చే జరగకుండా తెలివిగా తప్పించుకుంది కేంద్రం. మరీ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ఆదానీ వ్యవహారం పై కేంద్రం మౌనం వీడడం లేదు. మరోవైపు ప్రతిపక్షాలే టార్గెట్ గా ఈడీ, సిబిఐ దాడులు నిర్వహిస్తూ సొంత పార్టీ నేతలు చేసే అవినీతిని బయటపెట్టడం లేదు. ఇదేంటని ప్రశ్నించిన సమాధానం లేదు. ఇలా మోడీ సమాధానం చెప్పని.. చెప్పలేని ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నప్పటికి కేంద్రం మాత్రం వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నమే చేస్తోంది గాని, వాటన్నిటికీ సమాధానం చెప్పే సాహసం చేయడం లేదు. దీంతో మోడీ సర్కార్ వైఖరిపై విమర్శలు పెరిగిపోతున్నాయి. తాజాగా కాంగ్రేస్ నేత జైరాం రమేశ్ ప్రధాని మోడీ వైఖరిపై సెటైర్ల వర్షం కురిపించారు. ఆదానీ అంశం, చైనా సంక్షోభం, సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు, ఎం‌ఎస్ఏంఇ విధ్వంసం వంటి ఎన్నో అంశాలపై మోడీ మౌనం పాటిస్తున్నారని, అసలు మోడి మౌనం ఎందుకు పాటిస్తున్నారని జైరాం రమేశ్ ప్రశ్నించారు. అయితే ఈ డౌట్ అందరిలోనూ ఉంది.. మోడీ మౌనం వెనుక నిజాలు ఉన్నాయి కాబట్టే ఆయన మౌనం వహిస్తున్నారనేది కొందరి మాట.

Also Read: ఉరూరా గులాబీ జెండా పండుగ

- Advertisement -