- Advertisement -
మే 3తో కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంలకు కీలక సూచన చేశారు ప్రధాని.
లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు నాణ్యమైన మానవ వనరులు, ప్రపంచ స్తాయి మౌలిక వసతులు సిద్ధంచేయాలని ప్రధాని…ముఖ్యమంత్రులకు సూచించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కొంతమంది ముఖ్యమంత్రులు కోరగా మరికొంతమంది సడలింపులు ఇవ్వాలని ప్రధానికి విన్నవించారు. బెంగాల్ సీఎం మమతా దశల వారీగా ఆంక్షలు విధించాలని కోరారు.
- Advertisement -