ప్రధానితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ..

371
- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. సుమారు గంట పాటు ప్రధానితో కేసీఆర్ ఏకాంత చర్చలు జరిపారు. ఈ భేటీలో తెలంగాణ సమస్యలు పరిష్కరించాలంటూ 10 వినతిపత్రాలను ప్రధాని మోదీకి కేసీఆర్ ఇచ్చారు. మధ్యాహ్నం 4 గంటలకు ప్రధానితో సమావేశమైన సీఎం కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థికసాయం, రక్షణశాఖకు చెందిన భూముల కేటాయింపు ,జోనల్ వ్యవస్థ అమోదం వంటి అంశాలను ప్రధానంగా చర్చించారు.

Modi- KCR discuss for an hour

ఇక వీటితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల,కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) మంజూరుచేయాలని ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

ఈ పర్యటలో భాగంగా నిన్న పలువురు కేంద్రమంత్రులను కలిశారు సీఎం కేసీఆర్. హైకోర్టు విభజనను సత్వరం పూర్తిచేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కోరారు. హైకోర్టు విభజనతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ సంపూర్ణమైనట్టు తెలంగాణ ప్రజలు భావిస్తారని సీఎం స్పష్టం చేశారు. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కూడా కలిశారు సీఎం. రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నూతన జోనల్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని చెప్పారు.

- Advertisement -