శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులపై సమీక్ష..

252
- Advertisement -

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువగా కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి రాక బాగా తక్కువగా ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న15 టీఎంసీలు… త్రాగునీరుకు, డెడ్ స్టోరేజి, ఆవిరి నష్టాలకు బొటాబొటిన సరిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ప్రజలకు త్రాగునీటిని అందించడం. వచ్చే వేసవిలో ప్రజల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభుత్వం బావిస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Ministers do Review on SRSP Development Works

ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ టి. హరిష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు ద్వారా కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ పరిదిలోని రైతాంగం అవసరాలను జాగ్రత్తగా అంచనా వేస్తున్నామన్నారు. కొద్దిరోజులలో ప్రాజెక్టు ఎగువన మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు చేరితే, ఆయకట్టు అవసరాలకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నది. ప్రస్తుత పరిస్థితిని జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో అంచనా వేస్తూ, నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయి నుండి మానీటరింగ్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Ministers do Review on SRSP Development Works

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకురావడానికే రూ. 1100 కోట్లతో పునరుజ్జీవన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే యాసంగి నాటికి పనులను పూర్తిచేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందించాలని ప్రభుత్వం దృడసంకల్పం. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్ధం కోసం అమాయక రైతులను రెచ్చగొడుతున్నారు. రైతులు మోసపోవద్దని వినతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత సానుభూతితో వ్యవహరిస్తుంది. రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కావున రైతులు పరిస్థితిని అర్ధం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని మనవి చేస్తున్నాను.

Ministers do Review on SRSP Development Works

ఈ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మిషన్ భగీరధ వైస్ చైర్మన్, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ, ఆర్మూర్, బోదన్, కోరుట్ల శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. జీవన్ రెడ్డి, షకీల్ హైమద్, విద్యాసాగర్ రావు, జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్ చార్జి డా. సంజయ్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీదర్, శ్రీరాంసాగర్ సీఈ శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -