Bharat: ఇండియా కాదు ఇకపై భారత్!

23
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా దేశం పేరునే భారత్‌గా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీ20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 9న జరగనున్న డిన్నర్ భేటీకి ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా మార్చారు. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత్ అనే పదాన్ని అందరికీ అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తనదైన శైలీలో స్పందించారు. చరిత్రను వక్రీకరించడం, భారతదేశాన్ని విభజించడాన్ని మోడీ కొనసాగిస్తున్నారని.. ఇప్పుడు I.N.D.I.A కూటమిలోని పార్టీల లక్ష్యం భారత్ లో స్నేహం, సయోధ్య, నమ్మకాన్ని తీసుకురావడం ముఖ్యమని పేర్కొన్నారు.

Also Read:పిక్ టాక్ : కుర్ర హృదయాలు విలవిల

- Advertisement -