మోదీ ప్రభుత్వం జమిలి విధానంకు పచ్చజెండా ఉపుతోందా..!?

72
voting
- Advertisement -

దేశంలో జమిలి ఎన్నికలకు మోదీ ప్రభుత్వం స్వీకారం చూట్టబోతుంది. ఈ ఆంశాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది.

జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసిందని..వాటిని లా కమిషన్‌ పరిశీలిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. త్వరలో ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్‌ నుంచి క్లారిటీ రానుంది. వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని..2014 నుంచి ఇప్పటివరకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని పార్లమెంట్‌లో వివరించింది. ఎన్నికల నిర్వహణ ఆర్థిక భారంతో కూడుకుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజా ధనం వృధా కాదని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తోంది.

2016లో ప్రధాని మోదీ తొలిసారి జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. అప్పటి నుంచి వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ అనే అంశం తెరపైకి వస్తూనే ఉంది. ఇప్పటివరకు 1952 నుంచి 1967 మధ్యలో నాలుగు సార్లు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. దీంతో అప్పటికప్పుడు ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ క్రమంలో జమిలి ఎన్నికల అంశం కనుమరుగు అయ్యింది. అప్పటి నుంచి ఐదేళ్లు పూర్తి అయిన ప్రతి రాష్ట్రంలో ఎన్నిలను నిర్వహిస్తున్నారు. కాగా మరోసారి జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ ప్రభుత్వం.

- Advertisement -