దేశ ప్రజలకు మోదీ శుభవార్త..

12
- Advertisement -

దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. దీపావళి లోపు ప్రజలపై GST భారాన్ని తగ్గించనున్నట్లు ప్రకటించారు. సామాన్య ప్రజలకు డబుల్ దీపావళి బొనాంజా ఇవ్వనున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రకటించారు. అలాగే సోషల్ మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ.

సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వైపు దేశ యువత దృష్టి పెట్టాలని సూచించారు మోదీ. విదేశీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలని హితవు పలికారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండగ… సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయమిది అన్నారు. కోట్ల మంది త్యాగాలతో భారతావనికి స్వాతంత్య్రం వచ్చింది అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు నా సెల్యూట్… పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాం అన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు నిద్ర లేకుండా చేశాం… శత్రువులను మట్టిలో కలిపేశాం అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను ధైర్యంగా మట్టుబెట్టాం… సింధూ నదీ జలాలు భారతీయుల హక్కు అన్నారు. నదీ జలాలపై పూర్తి హక్కు భారతీయులది.. భారతీయ రైతులది అన్నారు.

Also Read:LSW:లక్నో సూపర్ జెయింట్స్‌..ప్రక్షాళన!

- Advertisement -