మోదీ విదేశీ పర్యటనల ఖర్చెంతో తెలుసా?

0
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది కేంద్రం. 2022 నుంచి 2024 డిసెంబర్‌ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు తెలిపింది. మోదీ విదేశీ పర్యటనకు సంబంధించి రూ.258 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపింది.

రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా. 2022 మే నుంచి 2024 డిసెంబర్‌ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు వెళ్లిందని… రూ.258 కోట్లు ఖర్చైనట్లు వెల్లడించారు.

2014కి ముందు అప్పటి ప్రధానులు చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. 2011లో అప్పటి ప్రధాని అమెరికా పర్యటనకు రూ.10.74 కోట్లు ఖర్చైనట్లు తెలిపారు.

Also Read:గాలిమేడల బడ్జెట్..అన్ని అసత్యాలే: హరీష్

- Advertisement -