Modi:రాష్ట్రానికి ప్రధాని..ట్రాఫిక్ ఆంక్షలు

20
- Advertisement -

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని రాక సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

రాత్రి 7.50 నిమిషాలకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు వాహనాలను అనుమతించరు.

రేపు ఉదయం రాజ్ భవన్ నుంచి తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు పీఎం మోదీ వెళ్లనున్నారు. దీంతో రేపు ఉదయం 8.35 నుంచి 9.10 వరకు రాజ్ భవన్, మోనప్ప ఐలాండ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వరకు పెహికిల్స్ ని అనుమతించరు. ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనరులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Also Read:Janasena:పవన్ కోసం కదిలిన చిరు

- Advertisement -