ఎన్డీయే పక్ష నేతగా మోడీ

4
- Advertisement -

ఎన్డీయే పక్ష నేతగా ఎన్నికయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్డీయే పక్ష సమావేశంలో మోడీని ఎన్నుకోగా ఎల్లుండి రాష్ట్రపతిని కలవనున్నారు. మోడీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాటం చేశామని పేదలు,మహిళలు,రైతుల కోసం పనిచేస్తామని వెల్లడించారు.

ప్రమాణ స్వీకారానికి జూన్ 8వ తేదీని ఖరారు చేసినట్లు ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 292 సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటింది. 543 సీట్లున్న లోక్ సభలో అధికారం చేపట్టడానికి 272 సీట్లు సాధించాలి. ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్నారు మోడీ.

Also Read:సత్యభామ..ఎమోషనల్ యాక్షన్ మూవీ

- Advertisement -