Modi:అధికారంపై మోడీ ధీమా..!

37
- Advertisement -

ఈ ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలతో కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఎవరిదనే దానిపై క్లారిటీ రానుంది. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అధికారంపై బీజేపీ గట్టిగానే కన్నేసింది. మూడోసారి అధికారం సాదించి హిస్టరీ క్రియేట్ చేయాలని భావిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఈసారి పవర్ కోసం తెగ ప్రయత్నిస్తోంది. బీజేపీని గద్దె దించే ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అధికారంపై ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఇంతకీ ప్రజా మద్దతు ఎటువైపు ఉందనేది అసలు ప్రశ్న. ఈ నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. గత పదేళ్ళ కాలంలో ప్రజలకు సుపరిపాలన అందించామని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు తమ పక్షాన ఉన్నారని మోడీ చెప్పుకొచ్చారు. .

గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన లోటుపాట్లను మొదటి ఐదేళ్లలో సారి చేశామని, ఆ తర్వాత రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత నవ భారత్ కు బాటలు వేశామని, ఇక మూడోసారి కూడా అధికారం చేపట్టి దేశాన్ని పునః నిర్మిస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మూడోసారి కూడా బీజేపీ గెలుపు విషయంలో ఆయన ధీమాగా ఉన్నారా అనే సందేహాలు రాక మానవు. అయితే గత ఐదేళ్లతో పోల్చితే మోడీ ఇమేజ్ ఈసారి చాలావరకు తగ్గిందనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చాలా రాష్ట్రల్లో వ్యతిరేకత ఉంది. దానికి తోడు గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. అయినప్పటికి గెలుపు విషయంలో మోడీ ఎందుకు అంతా ధీమాగా ఉన్నారనేది రాజకీయ వాదుల్లో మెదులుతున్న ప్రశ్న. మరి మోడీ ధీమా ఫలిస్తుందా ? లేదా అనేది చూడాలి.

Also Read:KCR:13న ఛలో నల్గొండ..మా నీళ్లు మాకే

- Advertisement -