Modi:వయనాడ్‌లో రాహుల్ ఓటమి ఖాయం

16
- Advertisement -

వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప‌శ్చిమ బెంగాల్‌లోని బ‌ర్ధ‌మాన్‌-దుర్గాపూర్‌లో శుక్ర‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ..వ‌య‌నాడ్‌లో ఓట‌మి భ‌యంతో రాయ్‌బ‌రేలి బ‌రిలో రాహుల్ గాంధీ దిగారని ఆరోపించారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయ‌నేది ఇప్పటికే స్ప‌ష్ట‌మైంద‌ని, దీనికి ఓపీనియ‌న్ పోల్స్ అవ‌స‌రం లేద‌న్నారు. రాహుల్ వ‌య‌నాడ్‌లో ఓట‌మి పాల‌వుతార‌ని తాను చెప్పాన‌ని, అందుకే రెండో స్ధానం కోసం వెతుకులాట చేప‌ట్టి రాయ్‌బ‌రేలి నుంచి బ‌రిలో నిలిచార‌ని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాల‌ని కోరుకుంటోంద‌ని, ద‌ళితులు, ఓబీసీ కోటాలను క‌త్తిరించి వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాల‌ని కుయుక్తులు ప‌న్నుతోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -