- Advertisement -
భారత్ చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామన్నారు ప్రధాని నరేంద్రమోదీ. నేడు మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో స్నేహంగా ఎలా ఉండాలో భారత్‌కు తెలుసని అన్నారు. అలాగే ఎలా దీటుగా బదులివ్వాలో కూడా తెలుసని వ్యాఖ్యానించారు.దేశంలో మనం సమస్యలు లేకుండా జీవించేందుకు సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పారు.
దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులు చొరవచూపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తుల వాడకానికే దేశ ప్రజలు మొగ్గుచూపాలని ప్రధాని మోదీ కోరారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలందరూ తగిన సూచనలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్క్ లు ధరించాలని కోరారు. సైనికుల త్యాగాలను వృధా పొనివ్వమని అన్నారు.
- Advertisement -