ఇవాళ స్పేస్ డే సందర్భంగా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెబుతూ కొత్త ఛాలెంజ్ విసిరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతరిక్ష శాస్త్రవేత్తలు రోదసి అన్వేషణ చేపట్టాలని కోరారు.
అంతరిక్ష రంగంలో భారత్ ఒక్కొక్క మైలురాయి అందుకుంటోందని, ఇది దేశానికి గర్వకారణమన్నారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా.. అంతరిక్ష రంగంతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు, యువతకు ఆయన విషెస్ తెలిపారు. సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు, ఎలక్ట్రానిక్ ప్రొపల్షన్ లాంటి టెక్నాలజీ సంబంధిత అంశాల్లో భారత్ అత్యాధునికంగా దూసుకెళ్తోందన్నారు.
అతి సుదీర్ఘ దూరంలో ఉన్న గెలాక్సీలు, అంతరిక్షం అధ్యయనం చేయాలన్నారు. చంద్రుడి మీదకు, మార్స్ మీదకు వెళ్లామని, డీప్ స్పేస్ అంశంలో మరింత లోతుగా అన్వేషణ చేపట్టాలని, మానవాళికి ఉపయోగపడే అనేక రహస్యాలు అక్కడ ఉంటాయన్నారు. పంట బీమా పథకాలు, మత్స్యకారుల రక్షణ, విపత్తు సహాయక చర్యలన్నీ ఇప్పుడు శాటిలైట్ ఆధారితంగా జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read:27న నారా రోహిత్..’సుందరకాండ’

