పరాజయం పాలైన కేంద్రమంత్రులు వీరే..

33
- Advertisement -

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీకి ఆశీంచిన స్థాయిలో సీట్లు మాత్రం రాలేదు. 400 పక్కా గెలుస్తామని చెప్పిన బీజేపీ కేవలం 241 స్థానాలకే పరిమితమైంది. ఇక మోడీ కేబినెట్‌లోని పలువురు కేంద్రమంత్రులు పరాజయం పాలయ్యారు.

ప్రధానంగా 2019లో రాహుల్‌ గాంధీపై గెలిచిన స్మృతి ఇరానీ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1,67,196 ఓట్ల తేడాతో స్మృతిపై గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ. ఎస్పీ అభ్యర్థి చేతిలో కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రిగా చేసిన అజ‌య్ మిశ్రా 34 వేల ఓట్ల తేడాతో ఓట‌మిపాల‌య్యారు.

కాంగ్రెస్ అభ్యర్థి కాళీ చరణ్ చేతిలో కేంద్రమంత్రి అర్జున్ ముండా 1,49,675 ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌శాఖ స‌హాయ మంత్రి కైలాశ్ చౌద‌రీపై కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉమ్మెడ రామ్ బెనివాల్ 4.48 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో గెలిచారు. అలాగే రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్,మ‌హేంద్ర నాథ్ పాండే,కౌశ‌ల్ కిషోర్ ,సాధ్వీ నిరంజ‌న్ జ్యోతి,రావు సాహెబ్ దాన్వే,ఆర్కే సింగ్‌, సంజీవ్ బాల్య‌న్‌,వీ ముర‌ళీధ‌ర‌న్,ఎల్ మురుగ‌న్ ,నిషిత్ ప్రామానిక్‌, సుభాష్ స‌ర్కార్‌ తదితర కేంద్రమంత్రులు ఓటమి పాలయ్యారు.

Also Read:కూర్మాసనంతో ఉపయోగాలు!

- Advertisement -