ఒకే దేశం..ఒకే ఎన్నికలు, కేబినెట్ గ్రీన్ సిగ్నల్

4
- Advertisement -

ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించి మరో ముందడుగు పడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మోడీ అధ్యక్షతన ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్బిల్లుకు కేబినెట్ అమోదం తెలిపింది.

శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్. బిల్లు అమోదం పొందితే దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఒకేసారి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ తన విస్తృతమైన 18,626 పేజీల నివేదికను మార్చి 2024లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీ రాజకీయ మరియు సామాజిక రంగాల్లోని ప్రముఖుల అభిప్రాయాలను సేకరించింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Also Read:బుక్‌ మై షోలో దేవర హవా!

- Advertisement -