మోడీ ప్రకటించిన రాయితీలు..

230
modi
- Advertisement -

నోట్ల రద్దు అనంతరం తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ..ప్రజలకు పలు రాయితీలు ప్రకటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం కోసం 9 లక్షల రుణం తీసుకునేవారికి 4 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. అలాగే 12 లక్షల రూపాయల రుణం తీసుకునే వారికి 3 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. ఇళ్ల మరమ్మతుల కోసం 2 లక్షల రూపాయల రుణాలు ఇస్తారు. ఈ రుణాలపై 3 శాతం వడ్డీపై రాయితీ ఇస్తారు. ప్రధాని ప్రకటనతో ఉద్యోగస్తులకు, మధ్య తరగతివారికి ప్రయోజనం చేకూరనుంది.

modi

చిన్న వ్యాపారులకు రూ.2కోట్ల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రూపే కార్డులుగా మార్చటం ద్వారా రైతులు నగదు రహిత లావాదేవీలు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. రాబోయే 3నెలల్లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రూపే కార్డులుగా మార్పు చేస్తామని వెల్లడించారు. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలపై 2 నెలల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.

గర్భిణీలకు వైద్యసాయం కోసం రూ.6వేలు వారి ఖాతాల్లో జమ చేస్తాం. సీనియర్‌ సిటిజన్స్‌ రూ.7.5 లక్షల వరకు బ్యాంకుల్లో దాచుకున్న నగదుపై 8శాతం వడ్డీ. డిజిటల్‌ లావాదేవీలు సరళంగా నిర్వహణకు భీమ్‌ యాప్‌. ఎక్కువమంది ప్రజలు భీమ్‌ యాప్‌ను ఆదరిస్తారు’’ అని ప్రధాని మోదీ తెలిపారు. ‘అవినీతి సంపద ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. పేద, మధ్యతరగతి ప్రయోజనాలకు తగిన పథకాలను ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల్లో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిలోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగితే అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు.

- Advertisement -