దేశమంతటా రైతుబంధు..వడ్డీలేని రుణాలు

324
modi
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పెద్దపీట వేసేందుకు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బాటలోనే రైతు బంధు అమలు చేయడంతో పాటు వడ్డీ లేని రుణాలు,బీమా వంటి పథకాలను అన్నదాతలకు చెరవేయాలని సమాలోచన చేస్తోంది.

రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు పంటకు రూ 4వేలు, 2 పంటలకూ 8వేలు అందించేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమా అయ్యేలా చేయడంతో పాటు అదనంగా లక్ష దాకా వడ్డీ లేని రుణం ఇవ్వనుంది. ఈవారంలో కొత్తస్కీములను ప్రకటించే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలుకు దాదాపు 2లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని అంచనా. వడ్డీలేని రుణాలకు దాదాపు 30వేల కోట్లు ఖర్చు చేయాలి. ఇప్పటిదాకా ఎరువుల సబ్సిడీ కింద ఇస్తున్న రూ 70 వేల కోట్ల స్కీమును, మరికొన్ని చిన్న చిన్న వ్యవసాయ సహాయ పథకాలను ఇందులో కలపనున్నారు.

అయితే రైతుబంధు పథకంలో రైతులకు అందించే డబ్బులో 70 శాతం కేంద్రం 30 శాతం ఆయా రాష్ట్రాలు భరించాలని కేంద్రం ప్రాతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కొన్నిరాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంలే ఉండటంతో ఈ స్కీమ్‌ అమలు సులభతరమేనని కేంద్రం అంచనా వేస్తోంది.

- Advertisement -