మోడీ@66

298
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ 66వ పడిలోకి అడుగుపెట్టారు. మోడీ తన పుట్టినరోజును తల్లి హీరాబెన్ సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోడీని తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం హీరాబెన్ మోడీకి స్వీట్లు తినిపించారు. కాసేపు తల్లీకొడుకులు ముచ్చటించారు. శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధానికి గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మంత్రివర్గంతో పాటు పలువురు స్వాగతం పలికారు.

pm-modi-with-mother

ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరింత సేవ చేయాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

pm-modi-with-mother

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. శాంతి, సౌభాగ్యాలు, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించేందుకు, అంతర్జాతీయంగా దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు ప్రధాని మోదీపై దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

modi

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో మోదీ సైకత శిల్పాన్ని రూపొందించి.. శుభాకాంక్షలు తెలియజేశారు.గుజరాత్‌లో ఉన్న ప్రధాని మోడీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్ ఠాకూర్‌ శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని కలిసి పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన చీఫ్‌ జస్టిస్‌ను ప్రధాని గుమ్మంలోకి ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు.

Modi

యాపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని టిమ్ కుక్ పేర్కొన్నారు.

- Advertisement -