- Advertisement -
కన్యాకుమారిలో మూడో రోజు ధ్యానం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వివేకానంద రాక్ మెమోరియల్‌లో ధ్యానం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచాక సముద్రతీరం నుంచి సూర్యోదయాన్ని వీక్షించి.. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించారు.
ఇవాళ దీక్ష ముగిశాక 133 అడుగుల తిరువళ్లువర్ విగ్రహం దగ్గరకు వెళ్లి అంజలి ఘటిస్తారు. ఆఖరు విడత ఎన్నికల ప్రచారం తర్వాత గురువారమే కన్యాకుమారికి చేరుకున్నారు. ముందు భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఫెర్రీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకుని ధ్యాన మండపంలో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తర్వాత వివేకానందుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ధ్యానముద్రలోకి వెళ్లారు.ప్రధాని ధ్యానం చేస్తున్న ప్రాంతంలో 3 అంచెల భద్రత కొనసాగుతోంది.
Also Read:ఈ ఆసనాలతో.. మలబద్దకం దూరం!
- Advertisement -