Modi 3.0: అన్ని సంచలన నిర్ణయాలే!

2
- Advertisement -

వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారం చేపట్టింది. అయితే ఈ సారి బీజేపీకి మిత్రపక్షాల మద్దతు కావాల్సి రాగా గత రెండు టర్మ్‌లలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది బీజేపీ. కానీ ఈసారి మిత్రపక్షాల మద్దతు కీలకం కావడంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్న భాగస్వామ్య పక్షాలను సంప్రదించాలని పరిస్థితి.

ఇక మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ..తన కేబినెట్‌లో 71 మందికి చోటు కల్పించారు. ఇటీవలె 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు పనిచేస్తునట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రధానంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమని ఇప్పటికే ప్రజలకు సంకేతాలిచ్చారు. పేద, మధ్యతరగతి, అట్టడుగు వర్గాలకు జీవన సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు బీజేపీ.

ప్రధానంగా ఈ సారి జమిలీ ఎన్నికలకు పచ్చజెండా ఉపనుంది బీజేపీ. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లోకి జమిలీ ఎన్నికలకు సంబంధించిన సంకేతాలను తీసుకెళ్లగా ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది బీజేపీ. ఒక దేశం.. ఒకే ఎన్నిక అంశాన్ని లోక్‌సభ ఎన్నికల 2024 మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని చెప్పినట్లుగానే ఆ దిశగానే అడుగులు వేస్తోంది.

Also Read:మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. దీంతో 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలలో ఏకీకృత ప్రభుత్వం కోసం ఒక నిబంధనను కమిషన్ సిఫార్సు చేసే అవకాశం ఉంది. మొత్తంగా మోడీ 3.0లో మరిన్ని సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.

- Advertisement -