అన్ని రాష్ట్రాల హోం సెక్రెటరీలతో కేంద్ర హోం సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర హోం సెక్రెటరీ గోవింద్‌మోహన్ నేతృత్వంలో పలు కీలక సూచనలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలో మాక్‌డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌కి హోం సెక్రెటరీలు, డీజీపీ, ఫైర్ డీజీ హాజరయ్యారు. రేపటి మాక్‌డ్రిల్‌పై రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలించింది. ఏ ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహించాలో సూచించింది కేంద్రం. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రేపు రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
శత్రుదేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది కేంద్ర హోం శాఖ. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను సిద్ధం చేసి, రిహార్సల్ జరపాలని సూచించారు. కాగా, 1971 తర్వాత ఇది మొదటిసారిగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహణ చేపట్టడం విశేషం.
Also Read:INTUC నేతలతో పొన్నం భేటీ

