రేపు తీరం దాటనున్న మోచా

50
- Advertisement -

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడిన మోచా తుపాన్‌ పోర్ట్‌బ్లెయిర్‌కి ఉత్తర ఆగ్నేయ దిశలో కదులుతుంది. ఇది బంగ్లాదేశ్‌లోని కోక్స్‌ బజార్‌కి దక్షిణ నైఋతి దిశలో 680కి.మీ దూరంలో మయన్మార్‌లోని సిట్ట్వేకి నైఋతి దిశలో 600కి.మీ దూరంలో విస్తరించింది. దీంతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Also Read: మామిడి .. తింటే ఏమౌతుందో తెలుసా ?

మోచా తుపాన్ ఆదివారము మధ్యాహ్నం ఆగ్నేయ బంగ్లాదేశ్‌ మరియు ఉత్తర మయన్మార్ తీరాల మధ్యలో గంటకు 160కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.  దీంతో కోక్స్‌బజార్, క్యాపియూ, సిట్ట్వే ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో తీరప్రాంత రాష్ట్రాలైన ఒడిశా పశ్చిమబెంగాల్‌ ఝార్ఖండ్ ఆంధ్రప్రదేశ్‌తీర రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు  భారత వాతవరణ శాఖ అలెర్ట్‌ జారీ చేసింది.

Also Read: కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?

దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా 2 నుంచి 4డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24గంటల్లో కర్ణాటకలో తుపాన్ దాటికి 6గురు మరణించారు. పలు చోట్ల భారీ చెట్లు కూలి రవాణాకు ఇబ్బంది కలిగింది.

- Advertisement -