స్పెయిన్‌లో మరో విపత్తు..నెట్‌వర్క్‌ డౌన్‌

6
- Advertisement -

స్పెయిన్‌లో మరో విపత్తు సంభవించింది. మొబైల్ నెట్‌వర్క్ ఆగిపోయింది.కొన్ని వారాల క్రితమే విద్యుత్ వ్యవస్థ విఫలమైన నేపథ్యంలో మరో విపత్తు సంభవించడం చర్చనీయాంశంగా మారింది. ఇబీరియన్ ద్వీపకల్పంలో ఇటీవల భారీగా కల్లోలం సృష్టించిన విద్యుత్ బ్లాక్‌అవుట్ తర్వాత ఇప్పుడు స్పెయిన్‌లో దేశవ్యాప్తంగా మొబైల్ మరియు ల్యాండ్‌లైన్ నెట్‌వర్క్ అంతరాయం కలిగింది.

అనేక ప్రాంతాల్లో ఫోన్ లైన్లు విఫలమవడంతో, అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడగా కొత్త నెంబర్లను అందించాల్సి వచ్చింది. తాము నెట్‌వర్క్ పనులను పునరుద్దరించే పనిలో బిజీగా ఉన్నాం… ఆరగాన్, ఎక్స్ట్రెమడూరా, బాస్క్ దేశం, వాలెన్సియా ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు.

ఈ ప్రాంతాల్లో 112 నంబర్ పనిచేయలేదు …ప్రస్తుతం వాలెన్సియా, ఆరగాన్, లా రియోజా, అండలూసియా తదితర ప్రాంతాల్లో 112 సేవలు పునరుద్ధరించబడ్డాయి అని చెప్పారు. 72% వినియోగదారులు నెట్‌వర్క్ విఫలమైందని, 18% సిగ్నల్ లేకపోవడం,10% పూర్తిగా సేవలు అందలేదని నివేదించారు.

ఏప్రిల్ నెలలో స్పెయిన్ మరియు పోర్చుగల్‌లో భారీగా విద్యుత్ బ్లాక్‌అవుట్ జరిగిన కొద్ది వారాల తరువాత జరిగింది. అప్పట్లో సుమారు 23 గంటల పాటు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ట్రాఫిక్ లైట్లు, రోడ్ల లైట్లు, పేమెంట్ టర్మినల్స్, డిజిటల్ స్క్రీన్లు పనిచేయకపోవడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది.సూపర్‌మార్కెట్లలో కస్టమర్లు మొబైల్ ఫోన్ లైట్లు ఉపయోగించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీలు, సాంకేతిక నిపుణులతో కూడిన విచారణ కమిటీను స్పెయిన్ ఏర్పాటు చేసింది. సైబర్ అటాక్ కారణమైందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Also Read:ఓదెల 2…ఓటీటీలో సరికొత్త రికార్డు!

- Advertisement -