మహిళల ఉపాధికి కొత్త పథకం ప్రారంభించిన ప్రభుత్వం..

200
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళల ఉపాధి కోసం ఈ కొత్త పథకం తీసుకువచ్చింది. తాజా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతోపాటు.. వాటి విక్రయం ద్వారా మహిళలూ ఉపాధి పొందేలా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ మత్స్యశాఖ. 60 శాతం సబ్సిడీతో సంచార విక్రయ వాహనాల (మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌) పంపిణీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందించనున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తమ తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మహిళలకు ఉపాధి అవకాలు పెంచడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన చేపలను అందించాలనే ఉద్దేశంతో సంచార చేపల విక్రయ పథకానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ అందించి అండగా ఉంటుంది. ఈ కార్యక్రమం వల్ల చేపల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉన్నది. డిమాండ్‌ను బట్టి ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని మత్స్యఅభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

- Advertisement -