- Advertisement -
ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ పాదచారుల వంతెనపై నిన్న జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివిధ కారణాలను చూసి ఈ తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లలో ముందు సరైన మౌలికవసతులను ఏర్పాటు చేయాలని… ఆ తర్వాత బుల్లెట్ రైలు గురించి ఆలోచించాలని అన్నారు. అంతవరకు బుల్లెట్ రైలు కోసం ఒక్క ఇటుకను కూడా పేర్చనీయమని హెచ్చరించారు.
వర్షాల వల్ల తొక్కిసలాట జరిగిందంటూ రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని… వర్షాలు ఇప్పుడే కొత్తగా రాలేదని రాజ్ థాకరే ఎద్దేవా చేశారు.
- Advertisement -