MMTS ప్రయాణికులకు గుడ్ న్యూస్‌..

42
mmts
- Advertisement -

ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఎంఎంటీఎస్ ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికుల కోసం 50% వరకు చార్జీలు తగ్గించారు. సబర్బన్‌ రైళ్ల సర్వీసులలో ఫస్ట్‌ క్లాస్‌ చార్జీల తగ్గింపును 5 మే 2022 నుండి అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని సబర్బన్‌ సెక్షన్లలో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్‌ జర్నీ ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రయాణికులకు సూచించారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు నిత్యం వేలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజారవాణ వ్యవస్థలో తమ వంతు సేవలందిస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి ప్రభావం ఎంఎంటీఎస్ ల పైనా పడింది. దాంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. అయితే, ప్రస్తుతం కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిపోవడంతో అధికారులు మళ్లీ ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈనేపథ్యంలో రైల్యే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -